News June 5, 2024
‘మా’ నుంచి హేమ సస్పెండ్!

రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు బిగ్ షాక్ తగిలింది. ఆమెను ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో ఉన్నారు.
Similar News
News December 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 112

ఈరోజు ప్రశ్న: జరాసంధుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 30, 2025
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News December 30, 2025
బంగ్లాలో ఇండియన్స్ వర్క్ పర్మిట్ల రద్దుకు అల్టిమేటం

ఇంక్విలాబ్ మంచ్ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాలో భారత వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. తాజాగా ఇంక్విలాబ్ సంస్థ యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. భారతీయులకు 24 గంటల్లోగా వర్క్ పర్మిట్లు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే 24 రోజుల్లోగా హాదీ హత్యకు కారణమైన ప్రతిఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలని కోరింది. నిందితులు భారత్‌కు పారిపోయారని ఆరోపించిన కొన్ని గంటల్లోనే ఈ అల్టిమేటం వచ్చింది.


