News May 17, 2024

హేమంత్ సోరెన్‌కు సుప్రీంలో చుక్కెదురు

image

ఎన్నికల ప్రచారం కోసం తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీన్ని ఈ నెల 21న వెకేషన్ బెంచ్ ముందు లిస్టింగ్ చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా ల్యాండ్ స్కామ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేయగా, అక్కడా ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

Similar News

News February 14, 2026

అప్పుల్లో AP నం.1.. మళ్లీ ₹500కోట్ల రుణమా: YCP

image

AP: అప్పుల్లో రాష్ట్రం నంబర్ 1గా ఉందని YCP ట్వీట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చే మంగళవారం ₹500 కోట్లు అప్పు చేయనుందని, ఈ మేరకు RBI శుక్రవారం నోటిఫై చేసిందని పేర్కొంది. ఈనెల 3న చంద్రబాబు సర్కారు ₹3,300 కోట్లు అప్పు చేసిందని, ఇప్పటికే రాష్ట్రంపై ₹3లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని మోపారని తెలిపింది. రుణ భారం పెరగడం తప్ప ప్రజల జీవన ప్రమాణాలు మారడం లేదని విమర్శించింది.

News February 14, 2026

మున్సి’పోల్స్’లో కాంగ్రెస్ విజయం.. రాహుల్ ఏమన్నారంటే?

image

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విజయం కార్యకర్తలు, తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఈ ఫలితాలు ప్రజాకర్షక విధానాలు, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధికి నిదర్శనం అని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

News February 14, 2026

282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

CSC ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో TGలో 10, APలో 7 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in