News July 3, 2024

హేమంత్ సోరెన్‌కు మళ్లీ సీఎం పగ్గాలు?

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు ఇవాళ ఆయనను శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. ల్యాండ్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో 5 నెలలు జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా చంపై సోరెన్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

Similar News

News July 6, 2024

ఆ రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న సాలకట్ల ఆణివార ఆస్థాన పర్వదినం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు గమనించాలని పేర్కొంది.

News July 6, 2024

నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

News July 6, 2024

శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం

image

AP: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని ఆర్కియాలజీకి పంపగా.. ఆ లిపి 14,15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి.