News July 4, 2024

ఈనెల 7న సీఎంగా హేమంత్ ప్రమాణం?

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రస్తుత సీఎం చంపై సోరెన్ తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ‘ఝార్ఖండ్ ముక్తి మోర్చా’ నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు తమ తదుపరి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7న ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందని రాజకీయ వర్గాల సమాచారం.

Similar News

News January 23, 2026

VHP నేతపై దాడి.. ఉజ్జయినిలో చెలరేగిన హింస

image

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హింస చెలరేగింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగినట్టు తెలుస్తోంది. పలు బస్సులకు నిప్పుపెట్టిన అల్లరిమూకలు ఇళ్లపై రాళ్లతో దాడి చేశాయి. దీంతో ఉజ్జయినిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.

News January 23, 2026

తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ

image

తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కొత్త సర్కార్ లోడింగ్ అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో డీఎంకేకు కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పారు. DMK ప్రభుత్వం CMC (కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కారుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. వికసిత్ భారత్‌ ప్రయాణంలో తమిళనాడు పాత్ర కీలకమని చెన్నైలో నిర్వహించిన సభలో మోదీ స్పష్టం చేశారు.

News January 23, 2026

UCILలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (<>UCIL<<>>) 8 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, సంబంధిత PG అర్హత గల అభ్యర్థులు జనవరి 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. నెలకు జీతం 2 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.80,500, 5 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.1,00,600, 9 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.1,20,600 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in