News June 21, 2024
అందుకే బొగ్గు గనుల వేలం: కిషన్‌రెడ్డి

దేశంలో ఇంధన అవసరాలను తీర్చేందుకే బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మార్కెట్‌లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉందని, బొగ్గు అంటే నల్ల బంగారమని అభివర్ణించారు. బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని, అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News February 11, 2026
నిజామాబాద్ జిల్లాలో 61.90 శాతం పోలింగ్ నమోదు

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం వరకు 61.90 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌లో 59.12 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటీలో 68 శాతం, బోధన్‌లో 68.64 శాతం, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 69.78 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు గాను 3,06,697 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు.
News February 11, 2026
ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

AP: క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పొడిగించింది. భూముల బదిలీకి సంబంధించి చట్టసవరణకు ముసాయిదా బిల్లు, ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభం సహా మొత్తం 24 అంశాలకు ఆమోదం తెలిపింది. ఆగిరిపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్‌కు 45.6 ఎకరాలు, సంజామలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు, ఆనందపురంలో 18.57 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.
News February 11, 2026
AIకి ప్రిపేర్ అవ్వకపోతే వెళ్లిపోవచ్చన్న గూగుల్

కంపెనీ AI ప్రణాళికలకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా విరమణ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. వారికోసం ఓ ప్యాకేజీని సైతం తీసుకొచ్చింది. USలో పనిచేసే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్(GBO)లోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించనుంది. GBO అనేది గూగుల్ సంస్థ ఉత్పత్తులు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ తదితరాలను పర్యవేక్షిస్తుంటుంది. అటు అమెజాన్, మెటా తదితర టెక్ కంపెనీలు ఇలాంటి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.


