News January 11, 2025

అందుకే టికెట్ ధరల సవరణ: TGSRTC

image

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు TGSRTC తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారమే కేవలం 5 రోజులపాటు ధరలను సవరించినట్లు పేర్కొంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ లేకపోయినా బస్సులను వెంటనే వెనక్కి రప్పిస్తున్నట్లు వివరించింది. సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను <<15112625>>50% పెంచిన<<>> సంగతి తెలిసిందే.

Similar News

News January 2, 2026

మహిళల కోసం కొత్త స్కీమ్.. వివరాలివే

image

TG: మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం(D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో యూనిట్ ధర రూ.2లక్షలు కాగా అందులో ప్రభుత్వం ₹1.40లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మిగతా ₹60వేలు బ్యాంకులు లోన్ ఇస్తాయి.

News January 2, 2026

బాలింతలు ఏం తినాలంటే?

image

ప్రసవమయ్యాక కొన్నిరోజులపాటు బాలింతకు తేలికగా జీర్ణమయ్యే, బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడే బిడ్డకు సరిపడా పాలు పడతాయి. పాలు, నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి. బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్, బీట్రూట్, బెండ వంటి కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. కిచిడీ, పులగన్నం తీసుకోవాలి. వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి గర్భాశయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

News January 2, 2026

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

image

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్‌గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్‌నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్‌‍కాస్ట్‌లో వివరించారు.