News October 13, 2025
ఫిట్‌నెస్‌కి సారా టిప్స్ ఇవే..

ప్రస్తుతకాలంలో వివిధ కారణాల వల్ల బరువు పెరిగేవారి సంఖ్య పెరిగింది. సారాఆలీఖాన్ కూడా మొదట్లో ఆ బాధితురాలే. ఒకప్పుడు బరువుగా ఉండే ఈమె ప్రస్తుతం ఎంతో ఫిట్‌గా మారారు. దీనికోసం ఎక్కువగా లీన్ ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకున్నానని సారా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రెగ్యులర్ యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయడం, ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు తగినంత నిద్రపోవడం కూడా తన ఆరోగ్యానికి కారణమంటున్నారామె.
Similar News
News October 13, 2025
30 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు: కృష్ణదేవరాయలు

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం అంగీకారం తెలిపిందని FCI కన్సల్టేటివ్ కమిటీ ఛైర్మన్ కృష్ణదేవరాయలు తెలిపారు. గత ఏడాది 15.92 లక్షల టన్నులు సేకరించిందని చెప్పారు. 14 లక్షల టన్నుల బియ్యాన్ని 10% బ్రోకెన్‌తో కొనుగోలు చేస్తారని, పంజాబ్ తరువాత ఏపీకే ఈ అవకాశం దక్కిందన్నారు. SKLM, VZM, పల్నాడు జిల్లాల్లో రాష్ట్రం స్థలాన్ని చూపిస్తే కొత్తగా గోడౌన్లను నిర్మిస్తామని వివరించారు.
News October 13, 2025
ఐ మేకప్ తీయకుండా పడుకుంటున్నారా?

రాత్రిళ్లు పడుకొనేముందు మేకప్ తియ్యడం తప్పనిసరి. ముఖ్యంగా ఐమేకప్ తియ్యకపోతే పలు సమస్యలు వస్తాయంటున్నారు చర్మ నిపుణులు. కళ్ల కింద నల్లటి వలయాలు, ఐ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే కనురెప్పలకు వేసే మస్కారా తీయకపోవడం వల్ల కనురెప్పల్లోని నూనె గ్రంథులు మూసుకుపోయి వాటికి తేమ అందదు. వాటి సహజత్వం కోల్పోయి పెళుసుబారి విరిగిపోతాయి. కాబట్టి రాత్రిపూట కళ్లకు వేసుకున్న మేకప్ తొలగించడం మంచిదని సూచిస్తున్నారు.
News October 13, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది.