News December 24, 2024

లోయలోపడ్డ ఆర్మీ వాహనం వివరాలు ఇవే

image

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో 350 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం 11 Madras Light Infantry (11 MLI)కి చెందినదిగా అధికారులు గుర్తించారు. 18 మంది జవాన్లతో కూడిన వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుంచి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు బయలుదేరగా మార్గంమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. 11 MLIకు చెందిన రెస్క్యూ బృందాలు స‌హాయక చ‌ర్య‌ల్ని ముమ్మ‌రం చేశాయి. జ‌వాన్ల మృతిపై White Knight Corps సంతాపం ప్ర‌క‌టించింది.

Similar News

News November 25, 2025

జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

image

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.

News November 25, 2025

పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

image

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.

News November 25, 2025

CCRHలో 90 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH )లో 90 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in