News September 13, 2024
ఖరీదైన కారు కొన్న హీరో అజిత్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పోర్షే జీటీ2ఆర్ఎస్ కారును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ.4 కోట్లకు పైమాటే. ఆయన భార్య షాలిని ఆ ఫొటోలను షేర్ చేశారు. అజిత్‌కు రేసింగ్, కార్లు, బైకులు అంటే ఇష్టం. ఈ ఏడాది ఆగస్టులోనూ ఆయన రూ.9 కోట్ల విలువైన ఫెరారీ కొన్నట్లు సమాచారం. దుబాయ్‌లో ఆయన ఆ కారు నడుపుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది.
Similar News
News November 26, 2025
ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉంటే చెప్పండి: మంత్రి నాదెండ్ల

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటూ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను కోరారు. బుధవారం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో రైతుల దగ్గరకి వెళ్లి ధాన్యం కొనుగోలులో ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతుందన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ధర్మరాజు ఉన్నారు.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


