News April 14, 2025
టూవీలర్లలో హీరో.. కార్లలో మారుతి

టూవీలర్ల అమ్మకాల్లో హీరో మోటార్స్ ఇండియాలో టాప్లో దూసుకెళ్తోంది. డీలర్స్ అసోసియేషన్ ఫాడా డేటా ప్రకారం 2024-25లో ఆ కంపెనీ 54లక్షల బైకులను విక్రయించింది. 48లక్షల వాహనాల విక్రయాలతో హోండా రెండో స్థానంలో ఉంది. అలాగే, కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ అగ్రస్థానంలో ఉంది. 2024-25లో సుమారు 16.72లక్షల కార్లను అమ్మింది. ఇదే కంపెనీ గతేడాది 16.08లక్షల వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ 2వ ప్లేస్ దక్కించుకుంది.
Similar News
News December 1, 2025
తెలంగాణ అప్డేట్స్

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్, ఫోన్ నంబర్, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.
News December 1, 2025
హైదరాబాద్లో 45 పోస్టులకు నోటిఫికేషన్

HYD సనత్నగర్లోని <
News December 1, 2025
మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?


