News October 20, 2024

హీరో కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం

image

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆమె వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. తన తల్లి అంటే తనకెంతో ఇష్టమని బిగ్‌బాస్, ఇతర ఇంటర్వ్యూలు & వేదికలపై ఆయన చెప్తుండేవారు. ‘ఈగ’, విక్రాంత్ రోణ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Similar News

News December 2, 2025

నల్గొండ: మద్య నియంత్రణపై రాష్ట్రానికే ఆదర్శం..!

image

ఉమ్మడి నల్గొండ పరిధి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గంలోని కొత్త వైన్ షాపులు ఊరి బయటే ఏర్పాటు చేసి మ.1 తర్వాతే విక్రయాలు కొనసాగిస్తున్నారు. సా.6 గంటల తర్వాత మాత్రమే పర్మిట్ రూములకు అనుమతి ఇస్తున్నారు. మద్యం టెండర్లు పొందిన యజమానులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమై బెల్ట్ షాపుల నిషేధం, మద్య నియంత్రణ, స్థానికులకు ప్రాధాన్యం వంటి మార్గదర్శకాలు ఇచ్చారు.

News December 2, 2025

IPLకు మరో స్టార్ ప్లేయర్ దూరం!

image

ఐపీఎల్-2026కు మరో స్టార్ ప్లేయర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్‌లో మ్యాక్సీ పంజాబ్ తరఫున ఆడగా తిరిగి రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే డుప్లెసిస్, రసెల్ వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News December 2, 2025

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

image

మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలుంటాయని తెలిసిందే. కానీ గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావడం, పుట్టే బిడ్డలో మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనే జన్యు సంబంధిత సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్‌లలో ఈస్ట్రోజెన్ ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందంటున్నారు. కాబట్టి వీటిని వాడేముందు వైద్యుల సలహా తప్పనిసరి అని సూచిస్తున్నారు.