News February 7, 2025

ప్రధాని మోదీని కలిసిన హీరో నాగార్జున

image

ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్‌ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.

Similar News

News February 7, 2025

ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?

image

మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.

News February 7, 2025

రేపటి లోగా బుమ్రా ఫిట్‌నెస్‌పై రిపోర్ట్!

image

భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్‌నెస్‌పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్‌తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News February 7, 2025

BCల జనాభా పెరిగింది: రేవంత్

image

TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని CM చెప్పారు.

error: Content is protected !!