News October 6, 2025

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న హీరో

image

‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఒకే రోజు రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన నటించిన డ్యూడ్, lik(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఈ నెల 17న రిలీజ్ కానున్నాయి. దీంతో ఈ తరం హీరోల్లో ‘నాని’ తర్వాత ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేయనున్న హీరోగా ప్రదీప్ రికార్డులకెక్కనున్నారు. గతంలో నాని ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాలు ఒకే రోజు(2015 మార్చి 21) థియేటర్లలో రిలీజయ్యాయి.

Similar News

News October 6, 2025

పత్తి రైతుకు మద్దతు దక్కుతుందా?

image

ఈ ఏడాది పత్తి పంట క్వింటాకు రూ.8,110 మద్దతు ధరగా నిర్ణయించారు. సీసీఐ నిబంధనలకు అనుగుణంగా పంటలో తేమ, నాణ్యత ఉంటేనే ఈ ధర వస్తుంది. పత్తిలో గరిష్ఠంగా 8-12% తేమనే CCI అనుమతిస్తోంది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు, చీడపీడల వల్ల ఈసారి పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో పాటు నాణ్యత కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల మద్దతు ధర దక్కుతుందో? లేదో? అనే ఆందోళన పత్తి రైతుల్లో నెలకొంది.

News October 6, 2025

కాసేపట్లో వర్షం

image

TG: రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. కొత్తగూడెం, హైదరాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, ములుగు, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇవాళ ఉదయం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో వర్షం కురిసిన సంగతి తెలిసిందే.

News October 6, 2025

మోక్షానికి సులభమైన మార్గం భక్తి ఒక్కటే

image

భక్తి మార్గానికి ఇతర మార్గాల వలె కఠినమైన నిబంధనలు ఉండవు. జ్ఞాన మార్గానికి వివేకము, వైరాగ్యము వంటి కష్టతరమైన సాధనా చతుష్టయం అవసరం. అర్హత లేనివారు జ్ఞానాన్ని అభ్యసిస్తే, వారికి అహంకారమే మిగులుతుంది. యోగ మార్గానికి యమ, నియమాది అష్టాంగాలు అవసరం. వీటిని పాటించకపోతే బాధలు తప్పవు. కానీ భక్తి యోగంలో ఈ నియమాలుండవు. భగవంతుడిపై భక్తి ఉంటే చాలు! ఈ శ్రేష్ఠ మార్గమే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. <<-se>>#Daivam<<>>