News February 15, 2025
మహిళా క్రికెటర్కు హీరో శివ కార్తికేయన్ సాయం!

తాము కష్టాల్లో ఉన్నప్పుడు సినీ నటుడు శివ కార్తికేయన్ చేసిన సాయాన్ని భారత మహిళా క్రికెటర్ ఎస్ సంజన గుర్తు చేసుకున్నారు. ‘2018 వయనాడ్ వరదల్లో ఇళ్లు కోల్పోయాం. నా ట్రోఫీలు, క్రికెట్ కిట్ కొట్టుకుపోయాయి. అప్పుడు శివ కార్తికేయన్ కాల్ చేసి హెల్ప్ కావాలా అని అడిగారు. కొత్త స్పైక్స్ కావాలని అడిగిన వారంలోనే అవి నా చెంతకు చేరాయి. అప్పుడు నా చుట్టూ ఎంత మంది మద్దతుదారులున్నారో తెలిసింది’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News January 3, 2026
పెళ్లికి ముందు శృంగారం నేరం.. ఏడాది జైలు శిక్ష

పెళ్లికి ముందు సహజీవనం, సెక్స్ను నేరంగా పరిగణించే చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది 2023లోనే అక్కడి అధ్యక్షుడి ఆమోదం పొందిన ఈ బిల్లు తాజాగా చట్టరూపం దాల్చింది. పెళ్లికి ముందు సహజీవనానికి ఆరు నెలలు, పెళ్లికి ముందు సెక్స్ నేరానికి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అయితే, ఇది వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించడమేనంటూ ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
News January 3, 2026
వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ తప్పనిసరి!

AP: బైక్పై వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధనను విశాఖ పోలీసులు అమలు చేస్తున్నారు. వాహనం నడిపే వారితోపాటు, పిలియన్ రైడర్ హెల్మెట్ పెట్టుకోకున్నా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు. జనవరి 1 నుంచి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే వేలాది మందికి చలాన్లు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై గత సెప్టెంబర్ నుంచి అవగాహన కల్పించామని అధికారులు చెబుతున్నారు.
News January 3, 2026
1,146పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

SBI 1146 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి అప్లై గడువును పొడిగించింది. తొలుత 996 పోస్టులను ప్రకటించగా.. మరో 150 పోస్టులను కలిపి గడువును JAN 10 వరకు పెంచింది. పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. VP వెల్త్, AVP వెల్త్, CRE పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. sbi.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


