News January 27, 2025

దర్శకుడిపై హీరో విశాల్ ఆగ్రహం

image

ఇళయరాజా సంగీతం వల్ల ఎంతోమంది తాగుబోతులుగా మారారని దర్శకుడు మిస్కిన్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. దీంతో తాను సరదాగా అలా మాట్లాడానని ఆయన ఇటీవల క్షమాపణలు తెలిపారు. అయితే, పదే పదే నోరు పారేసుకోవడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం మిస్కిన్‌కు అలవాటుగా మారిందని నడిగర్ (తమిళ నటుల) సంఘం అధ్యక్షుడు విశాల్ మండిపడ్డారు. ఇలాంటివి తాను అసలు క్షమించనని స్పష్టం చేశారు. విశాల్‌తో మిస్కిన్ ‘తుప్పరివాలన్’ తీశారు.

Similar News

News December 5, 2025

నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.531కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మ.2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ (రూ.200Cr), మెడికల్ కాలేజీ (రూ.130Cr), నర్సింగ్ కాలేజీ (రూ.25Cr) భవనాల నిర్మాణాలకు, WGL-నర్సంపేట 4 లేన్ల రోడ్డు (రూ.82.56Cr), నర్సంపేట పరిధిలో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మ.3.30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

News December 5, 2025

ఉప్పును నేరుగా చేతితో తీసుకోకూడదు.. ఎందుకు?

image

ఉప్పును నేరుగా చేతితో తీసుకోవడాన్ని అశుభంగా భావిస్తారు. ఇలా చేయడాన్ని రహస్యాలు పంచుకోవడంలా భావిస్తారు. ఫలితంగా గొడవలు జరుగుతాయని, చేతితో ఉప్పు తీసుకున్నవారిపై శని ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. జ్యేష్టాదేవి దోషాలను తొలగించడానికి ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఇతరుల చేతి నుంచి ఉప్పు స్వీకరిస్తే, వారిలోని చెడు ప్రభావం మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తారు.

News December 5, 2025

అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్‌<<>>ను రద్దు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే రిలీజ్‌నూ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.