News November 16, 2024

కన్నీళ్లు పెట్టుకున్న హీరో.. ఓదార్చిన సీఎం CBN

image

పితృ వియోగంతో శోకసంద్రంలో మునిగిపోయిన టాలీవుడ్ హీరో నారా రోహిత్‌ను తన పెద్దనాన్న, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రామ్మూర్తి కుమారులైన గిరీశ్, రోహిత్‌లను హత్తుకుని ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా, రామ్మూర్తికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన AIG ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

Similar News

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News November 26, 2025

న్యూస్ అప్‌డేట్స్ @4PM

image

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ

News November 26, 2025

ప్రెగ్నెన్సీలో మాయ ఇలా ఉందా?

image

ప్రెగ్నెన్సీలో మాయ, శిశువు రక్తనాళాలు రక్షణ లేకుండా గర్భాశయ ముఖద్వారానికి దగ్గరగా ఉండటాన్నే వాసా ప్రీవియా అంటారు. దీనివల్ల డెలివరీ సమయంలో తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం ఏర్పడొచ్చు. ఈ పరిస్థితి ఉంటే నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. కొన్నిసార్లు సీ సెక్షన్ చేయాల్సి రావొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకొని దీన్ని ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.