News April 8, 2024
హీరోలు 33, హీరోయిన్లు 10.. సినిమా ఫ్లాప్

టైటిల్ చూసి షాకయ్యారా? మీరు చదివింది నిజమే. 2003లో JP దత్తా డైరెక్షన్‌లో వచ్చిన ‘LOC కార్గిల్’లో 33మంది హీరోలు, 10మంది హీరోయిన్లు నటించారు. 4.15గంటల నిడివున్న ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ₹33కోట్ల బడ్జెట్ పెడితే ₹31కోట్లు వచ్చాయి. ఇందులో సంజయ్ దత్, అజయ్ దేవ్‌గన్, సైఫ్, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, నాగార్జున, రాణీ ముఖర్జీ, మనోజ్ బాజ్‌పాయ్, కరీనా, రవీనా టాండన్, నమ్రత వంటి తారలు నటించారు.
Similar News
News January 28, 2026
టుడే టాప్ స్టోరీస్

* EUతో ట్రేడ్ డీల్.. కోట్ల మందికి అద్భుత అవకాశాలు: PM మోదీ
* TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచి నామినేషన్స్
* రేపే మేడారం జాతర.. ప్రజలకు CM రేవంత్ శుభాకాంక్షలు
* సింగరేణిలో అవినీతి జరగలేదు: భట్టి
* ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి: చంద్రబాబు
* ‘జనసేన ఎమ్మెల్యే రాసలీలలు’.. YCP సంచలన వీడియో
* సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్
News January 28, 2026
UK ప్రధానులే లక్ష్యంగా చైనా ఆపరేషన్ ‘సాల్ట్ టైఫూన్’!

బ్రిటన్ రాజకీయాల్లో చైనా హ్యాకర్లు కలకలం రేపారు. ఏకంగా ముగ్గురు మాజీ PMలు బోరిస్, సునక్, లిజ్ ట్రస్‌కు క్లోజ్‌గా ఉన్న అధికారుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. ఆపరేషన్ ‘సాల్ట్ టైఫూన్’ పేరుతో 2021-2024 వరకు ఈ గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇది కొనసాగుతోందన్న అనుమానాలున్నాయి. ఏకంగా ప్రధాని నివాసంలోకే చైనా హ్యాకర్లు చొరబడ్డారని అక్కడి మీడియా కోడై కూస్తోంది.
News January 28, 2026
బాఫ్టా రేసులో మన ‘బూంగ్’.. మణిపురీ మ్యాజిక్!

ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మణిపురీ చిత్రం ‘Boong’ ప్రతిష్ఠాత్మక BAFTA 2026 నామినేషన్లలో చోటు సంపాదించింది. లక్ష్మీప్రియా దేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ‘బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతోంది. మణిపుర్ నేపథ్యంతో సాగే ఓ బాలుడి కథతో తీసిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రచ్చ చేస్తోంది. గ్లోబల్ స్టేజ్‌పై ఇండియన్ రీజినల్ సినిమా ఇలా మెరవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


