News September 16, 2024
పెళ్లిపై హీరోయిన్ అదితి పోస్ట్

హీరో సిద్ధార్థ్‌తో <<14114235>>పెళ్లి <<>>అనంతరం సోషల్ మీడియాలో హీరోయిన్ అదితిరావు హైదరీ తొలి పోస్ట్ చేశారు. ‘నువ్వే నా సూర్యుడు. నువ్వే నా చంద్రుడు. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా మహాసముద్రం మూవీ షూటింగ్లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.
Similar News
News November 2, 2025
రేపు సీఏ ఫలితాలు

దేశవ్యాప్తంగా నిర్వహించిన సీఏ ఫైనల్, ఇంటర్మీడియెట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ICAI రేపు విడుదల చేయనుంది. సీఏ ఫైనల్, ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ 2PMకు, ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్స్ ఫలితాలు 5PMకు రిలీజవుతాయి. https://www.icai.org/లో రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్కోర్‌ను తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 3-22 మధ్య ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
News November 2, 2025
నగలు సర్దేయండిలా..

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్నిరకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. దేనికవే విడివిడిగా పెట్టాలి. ఎయిర్‌టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడటం ఉత్తమం.
News November 2, 2025
డేవిడ్, స్టాయినిస్ దూకుడు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే?

టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా 186/6 రన్స్ చేసింది. టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74), స్టాయినిస్ (39 బంతుల్లో 64) వీరవిహారం చేశారు. వీరిద్దరూ కలిసి 7 సిక్సర్లు, 16 ఫోర్లు బాదారు. చివర్లో షార్ట్ (26*) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్ 2, దూబే 1 వికెట్ తీశారు.


