News December 3, 2024
జొమాటోపై హీరోయిన్ ఆగ్రహం

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై ‘జెర్సీ’ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్ సేవలు దారుణమని ట్వీట్ చేశారు. కస్టమర్ కేర్ నుంచి ఎవరైనా తనకు కాల్ చేసి, వారు సృష్టించిన గందరగోళాన్ని పరిష్కరించాలని కోరారు. 31 రోజులైనా తన సమస్యను పరిష్కరించలేదని, చాలా కోపంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
ప్రజా దర్బార్ ప్రాముఖ్యత మీకు తెలుసా?

నాగోబా జాతరలో ప్రజా దర్బార్ కీలకమైన ఘట్టం. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. పూర్వం గిరిజనులు తమ గోడును రాజులకు చెప్పుకోవడానికి ఈ దర్బార్ను వేదికగా చేసుకునేవారు. నేటికీ ఆ సంప్రదాయం సాగుతోంది. జాతరలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తారు. గిరిజనులు తమ భూమి, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలను వివరించి పరిష్కారం కోరుతారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది.
News January 18, 2026
JEE మెయిన్స్ రాసే అభ్యర్థులకు NTA కీలక సూచనలు

* NTA వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన <<18882709>>అడ్మిట్ కార్డు<<>>, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ వెంట తీసుకెళ్లాలి.
* పాన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/పాస్పోర్ట్/ఆధార్/ రేషన్ కార్డు/అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంక్ పాస్బుక్/12వ తరగతి అడ్మిట్ కార్డు తప్పనిసరి.
* అప్లై టైమ్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫొటో.
* దివ్యాంగులైతే మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్.
* పెన్ వెంట ఉంచుకోవాలి.
News January 18, 2026
PCOD, PCOS రాకుండా ఉండాలంటే?

మారిన జీవనశైలి వల్ల చాలామంది అమ్మాయిలు PCOD, PCOS సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అధిక బరువుంటే వ్యాయామం చేస్తూ, సమతుల ఆహారం తీసుకుని బరువు తగ్గాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.


