News April 4, 2024
నాతో రేప్ సీన్ చేయనని హీరోయిన్ ఏడ్చింది: రంజిత్

అలనాటి నటి మాధురీ దీక్షిత్ తనతో రేప్ సీన్‌లో నటించలేనని బోరున ఏడ్చేశారని వెటరన్ యాక్టర్ రంజిత్ వెల్లడించారు. 1989లో వచ్చిన రొమాంటిక్ మూవీ ‘ప్రేమ్ ప్రతిజ్ఞ’లో మిథున్ చక్రవర్తి, మాధురి జంటగా నటించారు. ఈ సినిమాలో రంజిత్ హీరోయిన్‌ను తోపుడు బండిపై రేప్ చేసే సీన్ ఉంటుంది. అయితే.. ఆ సీన్ చేయమని డైరెక్టర్ అడగ్గా.. మాధురి ఏడ్చి, ఆ సీన్‌లో నటించలేనని వేడుకున్నారట. బతిమాలితే చివరికి ఒప్పుకున్నారట.
Similar News
News March 15, 2026
వేసవి.. కోళ్ల దాణా విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లకు దాణాను తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఇవ్వడం మంచిది. అలాగే వాటికి పెట్టే ఆహారంలో అవసరమైన మోతాదులో విటమిన్స్, ఖనిజ లవణాలు ఉండాలి. మాంసకృత్తులు కొంత మేర తగ్గించాలి. విటమిన్-c కూడా దీనిలో ఉండేలా చూసుకోవాలి. అందుకే వేసవిలో కోళ్లకు ఎలాంటి దాణా అందిస్తే మంచిదో తెలుసుకోవడానికి వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
News March 15, 2026
కారు డ్యాష్‌బోర్డులో గణపతి విగ్రహం ఉందా?

కారులో వినాయకుడి విగ్రహం ఉంచడం రక్షణకు, శుభానికి సంకేతం. విగ్రహం కూర్చున్న భంగిమలో, తొండం ఎడమ వైపుకు, డ్రైవర్ వైపు తల ఉండటం వల్ల సానుకూల శక్తి లభిస్తుందని నమ్మకం. విగ్రహం చిన్నదిగా ఉండి, డ్రైవింగ్‌కు అడ్డంకి కాకుండా స్థిరంగా అంటించాలి. నిత్యం శుభ్రత పాటిస్తూ, విగ్రహంపై దుమ్ము లేకుండా చూడాలి. ఒకవేళ విగ్రహం విరిగితే వెంటనే మార్చాలి. ఈ నియమాలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా, ప్రశాంతంగా సాగుతుంది.
News March 15, 2026
హ్యాపీ హార్మోన్స్.. ఇవి ఎలా లభిస్తాయి?

ఎమోషన్స్ బావుండటానికి, రోజంతా హ్యాపీగా ఉండటానికి శరీరంలో సెరటోనిన్ హార్మోన్ సరిపడినంత ఉండటం ముఖ్యం. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. పీచు పదార్థాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం, రోజూ ఎండలో కాసేపు ఉండటం, ధ్యానం చేయడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.. ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో సెరటోనిన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ ఫిష్‌లో ఎక్కువగా ఉంటుంది.


