News July 3, 2024
హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జంట హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. నూతన దంపతులు స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ హనీమూన్ ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా గత నెల 23న సోనాక్షి, జహీర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన వీరి వివాహానికి సినీతారలు, సెలబ్రిటీలు పెద్దఎత్తున హాజరయ్యారు.
Similar News
News March 15, 2026
వార్ ఎఫెక్ట్.. పాక్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత

పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ పాకిస్థాన్‌పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు <<19319137>>భారీగా పెరగగా<<>>, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది జీతాల్లో కోతకు ప్రభుత్వం సిద్ధమైంది. 5 నుంచి 30 శాతం తగ్గించేందుకు ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో పాక్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం ముదురుతోందని నిపుణులు చెబుతున్నారు.
News March 15, 2026
వేసవి.. కోళ్ల దాణా విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లకు దాణాను తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఇవ్వడం మంచిది. అలాగే వాటికి పెట్టే ఆహారంలో అవసరమైన మోతాదులో విటమిన్స్, ఖనిజ లవణాలు ఉండాలి. మాంసకృత్తులు కొంత మేర తగ్గించాలి. విటమిన్-c కూడా దీనిలో ఉండేలా చూసుకోవాలి. అందుకే వేసవిలో కోళ్లకు ఎలాంటి దాణా అందిస్తే మంచిదో తెలుసుకోవడానికి వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
News March 15, 2026
కారు డ్యాష్‌బోర్డులో గణపతి విగ్రహం ఉందా?

కారులో వినాయకుడి విగ్రహం ఉంచడం రక్షణకు, శుభానికి సంకేతం. విగ్రహం కూర్చున్న భంగిమలో, తొండం ఎడమ వైపుకు, డ్రైవర్ వైపు తల ఉండటం వల్ల సానుకూల శక్తి లభిస్తుందని నమ్మకం. విగ్రహం చిన్నదిగా ఉండి, డ్రైవింగ్‌కు అడ్డంకి కాకుండా స్థిరంగా అంటించాలి. నిత్యం శుభ్రత పాటిస్తూ, విగ్రహంపై దుమ్ము లేకుండా చూడాలి. ఒకవేళ విగ్రహం విరిగితే వెంటనే మార్చాలి. ఈ నియమాలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా, ప్రశాంతంగా సాగుతుంది.


