News January 27, 2025
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

నాని ‘పిల్ల జమిందార్’ హీరోయిన్ హరిప్రియ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త వశిష్ఠ సోషల్ మీడియాలో వెల్లడించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా బాలకృష్ణ సరసన ‘జైసింహ’తో పాటు పలు కన్నడ చిత్రాల్లో హరిప్రియ నటించారు.
Similar News
News December 6, 2025
మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.
News December 6, 2025
కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.
News December 6, 2025
రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

AP: అతి తక్కువ ధరకే వారసత్వ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నామమాత్రపు స్టాంపు డ్యూటీ వసూలుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100, దానికంటే ఎక్కువైతే రూ.1,000 స్టాంపు డ్యూటీ వసూలు చేస్తారు. భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించిన ఆస్తులకే ఈ రాయితీ వర్తిస్తుంది.


