News March 18, 2024
హీరోయిన్‌కు యాక్సిడెంట్.. ఐసీయూలో చికిత్స

మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తిరువనంతపురంలోని ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావాలని మరో నటి గోపికా అనిల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘పొంగి ఎజు మనోహర’ చిత్రంతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరుంధతి.. 7 సినిమాలు, 2 వెబ్‌సిరీస్‌లలో నటించారు.
Similar News
News November 19, 2025
ములుగు: పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు!

ములుగు జిల్లాలో రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ మొదటి వారంలో 30 సెంటీగ్రేట్లకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రస్తుతం జిల్లాలో అత్యల్పంగా 11 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు చలి తీవ్రతలు ఎదుర్కొనేందుకు తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News November 19, 2025
జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.


