News December 7, 2024
బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఫొటో షేర్ చేసి నవమాసాలు గడిచిన రోజులను గుర్తుచేసుకుంది. ‘తల్లి డ్యూటీ చేస్తూ ఎన్నో కోరికలను కోరుతూ 2024ను ముగిస్తున్నా. 9 నెలలు నా కడుపులో మోసి అచ్చం తనలాగే ఉండే ఒక బేబీని భర్తకు బెస్ట్ బర్త్డే గిఫ్టుగా ఇచ్చా’ అని పోస్ట్ చేసింది. తెలుగులో మన్మథుడు-2, దాస్ క దమ్కీ, హరోం హర, ద వారియర్, పలు కన్నడ, తమిళ సినిమాల్లోనూ ఆమె నటించారు.
Similar News
News December 4, 2025
MHBD: తండా ఒక్కటే.. ఓటింగ్ వేరు!

తండా ఒక్కటిగా కలిసి ఉన్నా ఎన్నికల్లో వీరిని రెండు ముక్కలు చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఇటుకలగడ్డ తండా రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంది. ఇటుకల గడ్డతండాలో ప్రధాన రహదారికి ఓ వైపు ఎలమంచిలితండా గ్రామ పరిధిలో, మరో వైపు గిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. పండగలన్నీ కలిసి చేసినా.. ఎన్నికల పండగలప్పుడు మాత్రం తండావాసులు పంచాయతీ ఎన్నికల వేళ రెండు గుంపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తారు.
News December 4, 2025
పంటను బట్టి యూరియా వాడితే మంచిది

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.
News December 4, 2025
త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్కు రాహుల్ గాంధీ!

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.


