News January 5, 2025
త్రివిక్రమ్‌పై హీరోయిన్ ఆరోపణలు.. స్పందించిన నటుడు
డైరెక్టర్ త్రివిక్రమ్‌పై తాను చేసిన ఫిర్యాదుపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) చర్యలు తీసుకోలేదని <<15070661>>హీరోయిన్ పూనమ్ కౌర్<<>> ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు, MAA ట్రెజరర్ శివబాలాజీ స్పందించారు. ‘ఆమె నుంచి MAAకు ఫిర్యాదు రాలేదు. గతంలో కంప్లైంట్ చేసినట్లు రికార్డుల్లోనూ లేదు. ట్వీట్లు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. MAAను, కోర్టును ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుంది’ అని తెలిపారు.
Similar News
News January 7, 2025
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు.. వారం రోజులే గడువు
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష విధానం, సిలబస్ కోసం <
సైట్: https://exams.nta.ac.in/AISSEE/
News January 7, 2025
నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరోవైపు అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
News January 7, 2025
చైనా మాంజా అమ్మితే రూ.లక్ష వరకూ ఫైన్!
TG: సంక్రాంతికి గాలి పటాలు ఎగురవేసేందుకు కాటన్ దారాలను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 040-23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్లలో ఫిర్యాదు చేయాలన్నారు. చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, ₹లక్ష వరకూ ఫైన్, మనుషులు, పక్షులకు హాని జరిగితే 3-5 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా ఉంటుందన్నారు. NGT ఆదేశాలతో TGలో చైనా మాంజా వాడటాన్ని నిషేధించామన్నారు.