News January 5, 2025
రోహిత్‌పై హీరోయిన్ ప్రశంసలు.. నెటిజన్ల సెటైర్లు

ఐదో టెస్టు నుంచి తప్పుకున్న రోహిత్ శర్మపై బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ‘రోహిత్ శర్మ, వాట్ ఏ సూపర్‌స్టార్’ అని ట్వీట్ చేశారు. దీంతో ఓ నెటిజన్ ‘ముందు అతడిని ఇన్‌స్టాలో ఫాలో అవ్వండి మేడం. తర్వాత సపోర్ట్ చేయండి’ అని సెటైర్ వేశాడు. అయితే రోహిత్ పీఆర్ టీమ్ ఆమెతో ఇలా ట్వీట్ చేయించిందని మరికొందరు ఆరోపించారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను విద్యాబాలనే పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేశారని అంటున్నారు.
Similar News
News December 28, 2025
కోచ్ మార్పుపై BCCI క్లారిటీ

టెస్ట్ జట్టు కోచ్‌గా గంభీర్‌ను పక్కనపెట్టి లక్ష్మణ్‌ను తీసుకొంటారని వస్తున్న వార్తలను BCCI ఖండించింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది సౌతాఫ్రికా(0-2), న్యూజిలాండ్(0-3)తో టెస్టు సిరీస్‌లు వైట్‌వాష్ కావడంతో గంభీర్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాదాపు 12ఏళ్ల తర్వాత IND స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. దీంతో గంభీర్ ప్రయోగాలే ఓటమికి కారణమని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
News December 28, 2025
హాదీ హంతకులు భారత్‌లోనే ఉన్నారు: ఢాకా పోలీసులు

బంగ్లా పొలిటికల్ యాక్టివిస్ట్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు. ‘ఫైసర్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ స్థానికుల సాయంలో మైమన్సింగ్లో బార్డర్ క్రాస్ చేశారు. భారత్‌లో వారిని పూర్తి అనే వ్యక్తి రిసీవ్ చేసుకున్నారు. సామీ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయాలో తురా సిటీకి తీసుకెళ్లారు. భారత అధికారులను సంప్రదిస్తున్నాం’ అని అడిషనల్ కమిషనర్ నజ్రూల్ తెలిపారు.
News December 28, 2025
గాలిపటం కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

TG: గాలిపటం కొనివ్వలేదని రెండో తరగతి చదువుతున్న బాలుడు(9) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మహబూబ్‌నగర్(D) చిల్వేర్‌లో జరిగింది. రాజు-శ్రీలత దంపతుల కుమారుడు సిద్ధూ పతంగి కొనివ్వమని అడగగా నిరాకరించారు. దీంతో అతడు పేరెంట్స్‌ను భయపెట్టాలని ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరి వేసుకున్నట్లు నటించాడు. కానీ దురదృష్టవశాత్తు అది మెడకు బిగుసుకుపోయింది. విలవిల్లాడుతున్న సిద్ధూను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.


