News October 5, 2024

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా వారసుడు హతం!

image

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ హతమైనట్లు సౌదీ మీడియా అల్ హదత్ పేర్కొంది. సదరన్ బీరుట్‌లోని హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన దాడుల్లో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సఫీద్దీన్‌‌తోపాటు ఆయన అనుచరులు కూడా మరణించినట్లు సమాచారం. కాగా ఇజ్రాయెల్‌పై మిస్సైళ్ల దాడి చట్టబద్ధమేనని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 17, 2026

ట్రంప్‌కు భారీ షాక్

image

హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని US అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన <<19394650>>పిలుపునకు<<>> మిత్ర దేశాలు, చైనా ససేమిరా అన్నాయి. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌తోపాటు జపాన్ తేల్చిచెప్పాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని స్పష్టం చేశాయి. ముందు దాడులను ఆపాలని చైనా సూచించింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

News March 17, 2026

సినిమా పైరసీ చేస్తే మూడేళ్ల జైలు!

image

TG: రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపడుతోంది. మూవీ పైరసీ చేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ తప్పదని CSB డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి సంయుక్తంగా యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News March 17, 2026

పెరగనున్న కార్ల ధరలు!

image

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.