News September 11, 2024

హెజ్బొల్లా కమాండర్ హతం?

image

ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా కమాండర్ మొహమ్మద్ క్వాసీం అల్-షేర్‌ను హతం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. తూర్పు లెబనాన్‌పై జరిపిన దాడుల్లో ఆయన హతమైనట్లు పేర్కొంది. కాగా ఇరాన్ అండదండలతో ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా కాలు దువ్వుతోంది. ఆ దేశంపై పదే పదే దాడులకు పాల్పడుతోంది. ఓ పక్క ఇజ్రాయెల్-హమాస్ చర్చలు జరుగుతున్నా హెజ్బొల్లా రాకెట్ దాడులకు పాల్పడుతోంది. దీంతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది.

Similar News

News November 25, 2025

ఉంగుటూరు: సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల డిసెంబర్ 1న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఉంగుటూరు నియోజకవర్గంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, సీఎం పాల్గొనే సభ ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు మంగళవారం ప్రాంతాన్ని పరిశీలించారు.

News November 25, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

image

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>

News November 25, 2025

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌లో ఉద్యోగాలు

image

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(<>BRIC<<>>)12 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 21వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో 6 పోస్టులను రెగ్యులర్‌గా, 6 పోస్టులను డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://dbtindia.gov.in