News October 1, 2024

హెజ్బొల్లా రాజకీయ పార్టీ: ఇరాన్

image

హెజ్బొల్లా టెర్రరిస్టు గ్రూప్ కాదని, అదో రాజకీయ పార్టీ అని భారత్‌లో ఇరాన్ అంబాసిడర్ Dr.ఇరాజ్ ఇలాహీ అన్నారు. తమ రక్తపాతం, విధ్వంసాన్ని జస్టిఫై చేసుకొనేందుకే ఇజ్రాయెల్ దానిని టెర్రరిస్టు గ్రూప్‌గా ముద్ర వేస్తోందన్నారు. ‘హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం ముస్లిములు, లెబనాన్‌కే కాదు ప్రపంచ మానవాళికే భారీ నష్టం. ఆయనో గ్రేట్ లీడర్, పొలిటీషియన్. ప్రపంచంలో అందరికీ తెలియడం చిన్న విషయం కాదు’ అని అన్నారు.

Similar News

News November 28, 2025

డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో జరగనున్న 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొంటారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై USలో అదనపు సుంకాలు విధించిన వేళ పుతిన్‌ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

News November 28, 2025

12 కాదు.. వచ్చే ఏడాది 13 మాసాలు ఉంటాయి!

image

సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026, MAR 30న మొదలయ్యే పరాభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణం. ‘దీనిని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది శ్రీమహా విష్ణువుకు ప్రీతిపాత్రం. అధిక మాసంలో పూజలు, దానధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్ఠం’ అని పండితులు సూచిస్తున్నారు. SHARE IT

News November 28, 2025

మూవీ ముచ్చట్లు

image

* Netflixలో స్ట్రీమింగ్‌ అవుతున్న హీరో రవితేజ ‘మాస్ జాతర’
* రిలీజైన వారంలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ మూవీ
* నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
* బాక్సాఫీస్ వద్ద గుజరాతీ చిత్రం ‘లాలో కృష్ణా సదా సహాయతే’ రికార్డులు.. రూ.50 లక్షలతో నిర్మిస్తే 49 రోజుల్లో రూ.93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్