News August 12, 2024

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ‘ప్రొజక్టైల్’ దాడులు

image

లెబనాన్ నుంచి 30 ప్రొజక్టైల్స్ తమ భూభాగంలోకి వచ్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదని తెలిపింది. హమాస్ సీనియర్ కమాండర్ మృతికి ప్రతీకారంగా హెజ్బొల్లానే ఇలా చేసినట్టు సమాచారం. చిన్నపాటి క్షిపణుల్లా ఉండే ప్రొజక్టైల్స్ అంత శక్తిమంతమైనవి కావు. ఈ దాడులపై US స్పందించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా గైడెడ్ మిసైల్ సబ్ మెరైన్‌ను మోహరించాలని US డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు.

Similar News

News September 14, 2025

శుభ సమయం (14-09-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ సప్తమి ఉ.8.53 వరకు
✒ నక్షత్రం: రోహిణి మ.1.13 వరకు
✒ శుభ సమయములు: ఉ.8.35-ఉ.9-09
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.11.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: ఉ.7.17వరకు పునః రా.6.23-రా.7.53
✒ అమృత ఘడియలు: ఉ.10.14-ఉ.11.43 వరకు, పునః మ.3.29-సా.4.59

News September 14, 2025

TODAY HEADLINES

image

* సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి: CM చంద్రబాబు
* కృష్ణా జలాల వాటాలో చుక్కనీటిని వదలొద్దు: రేవంత్
* గ్రూప్-1లో రూ.1,700 కోట్ల కుంభకోణం: కేటీఆర్
* రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడకూడదు: పవన్
* ఏపీలో 14 మంది ఐపీఎస్‌ల బదిలీ
* మణిపుర్ ప్రజల వెంటే ఉంటా: మోదీ
* నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్‌రావు
* ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి: రాజా సింగ్

News September 14, 2025

బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక

image

ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాపై శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 139/5 రన్స్ మాత్రమే చేసింది. జాకిర్ అలీ (41*), షమీమ్ హుస్సేన్(42*) మాత్రమే రాణించారు. లంక బ్యాటర్లు 32 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ని ముగించేశారు. నిస్సంక హాఫ్ సెంచరీ, కమిల్ మిషారా(46*), కెప్టెన్ అసలంక(10*) రాణించారు. బంగ్లా బౌలర్స్ మహేదీ హసన్ 2, ముస్తఫిజుర్, తన్‌జిమ్ చెరో వికెట్ తీశారు.