News November 18, 2024

హెజ్బొల్లా కీలక నేత హతం

image

హెజ్బొల్లా మీడియా రిలేషన్స్ చీఫ్‌ మహ్మద్ అఫీఫ్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. బీరుట్‌లో జరిపిన ఐడీఎఫ్ వైమానిక దాడిలో అఫీఫ్ మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోనూ దాడులు చేస్తోంది. ఇవాళ జరిపిన దాడుల్లో 12 మంది పౌరులు మరణించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Similar News

News November 18, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 18, 2024

నవంబర్ 18: చరిత్రలో ఈరోజు

image

1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
1984: నటి నయనతార జననం
1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం

News November 18, 2024

పాక్‌లో హిందువుల పరిస్థితి చూస్తే బాధేస్తుంది: పవన్

image

పాకిస్థాన్‌లో ఇద్దరు హిందూ బాలికలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై ఏపీ Dy.CM పవన్ విచారం వ్యక్తం చేశారు. ఇస్లాంకోట్‌లో హేమ(15), వెంటి(17) చెట్టుకు ఉరివేసుకుని కనిపించారని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. ‘పాక్‌లో హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు బలవ్వడం చాలా బాధాకరం. PAK, BANలో హిందువుల దుస్థితిపై వార్తలు చూసిన ప్రతిసారీ నాకు చాలా బాధ కలుగుతుంది’ అని ట్వీట్ చేశారు.