News September 5, 2024
తుపాకీ హింసతో దాక్కోవాల్సిన పరిస్థితి: జో బైడెన్

జార్జియా స్కూల్లో విద్యార్థులపై కాల్పులు కలచివేశాయని US అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. చదవడం, రాయడానికి బదులు తుపాకీ గుళ్లకు బలికాకుండా దాక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ఇకపై ఇలాంటి హింస జరగకుండా US కాంగ్రెస్‌లో భద్రతా చట్టం తెచ్చేందుకు రిపబ్లికన్లు సహకరించాలని కోరారు. ‘మతిలేని తుపాకీ హింసలో మరణించిన విద్యార్థులకు నేనూ, జిల్ సంతాపం ప్రకటిస్తున్నాం. దీనిని ఎంతమాత్రం సహించలేం’ అని అన్నారు.
Similar News
News October 23, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కాకినాడ కలెక్టర్ సూచనలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు మధ్యాహ్నం వాయుగుండంగా మారుతుందని కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పరిస్థితులను సమీక్షించేందుకు కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, అవి 27వ తేదీ వరకు పనిచేస్తాయని చెప్పారు. సహాయం కోసం 0884-2356801 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్‌లో రౌడీషీటర్‌ను ఓడించండి: KCR

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని BRS చీఫ్ KCR పేర్కొన్నారు. ‘భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించి HYDలో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వసిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మాగంటి సునీత గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నేతలకు KCR దిశా నిర్దేశం చేశారు.
News October 23, 2025
TET తీర్పుపై సమీక్షకు సుప్రీంలో పిటిషన్: APTF

AP: TETపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ఏపీటీఎఫ్ తెలిపింది. ‘2017లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం RTE-2010కి పూర్వం ఉన్న టీచర్లు కూడా TET పాస్ కావాలని సుప్రీం తీర్పిచ్చింది. అయితే అప్పటి టీచర్లకు టెట్‌ను వర్తింపచేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. 2010కి ముందున్న టీచర్లను దీని నుంచి మినహాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి’ అని విన్నవించింది.