News September 7, 2024
HIGH ALERT: తీవ్ర అల్పపీడనం.. అత్యంత భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది సోమవారానికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. రేపు ఏలూరు, అల్లూరి, ఉ.గో, NTR జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కృష్ణా జిల్లాల్లో భారీ వానలు పడతాయంది. పూర్తి జాబితా కోసం ఇక్కడ <
Similar News
News October 15, 2025
అక్టోబర్ 30న శ్రీవారి పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం వంటి ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్న వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం చేస్తారు. సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.
News October 15, 2025
ఓ టెకీ.. నీ శరీరం కోరుకుంటోందిదే!

స్తంభించిన జీవనశైలితో ఎంతో మంది టెకీలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ‘నేచర్ సైన్స్ రిపోర్ట్స్’ అధ్యయనంలో తేలింది. ‘సమయానికి ఆహారం ఇవ్వవు. ఇచ్చినా ప్రాసెస్ చేయలేని జంక్ ఇస్తావ్. నిద్రలేక నేను కూడా అలసిపోయాను. నా మాటే వినకపోతే, నీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది’ అని టెకీ శరీరం హెచ్చరిస్తోంది. అందుకే ఇకనైనా రోజూ వ్యాయామం, నడకతో పాటు సరైన నిద్రాహారాలు ఉండేలా చూసుకోండి. SHARE IT
News October 15, 2025
ఓట్ల చోరీతో గెలిచింది బీఆర్ఎస్సే: శ్రీధర్

TG: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. అసలు ఓటు చోరీతో గెలిచిందే BRS పార్టీయని <<18006137>>కేటీఆర్<<>> వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. గతంలో MLC ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసి గెలిచిందని ఆయన విమర్శించారు. అర్హత లేని విద్యార్థులను ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. మరోవైపు మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమస్య ఉంటే పరిష్కారం చూపేందుకు పీసీసీ చీఫ్, CM ఉన్నారని తెలిపారు.