News September 7, 2024

హై అలర్ట్.. వరదలపై ప్రభుత్వం WARNING

image

విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరే అవకాశం ఉందని, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. బుడమేరు గండ్లను పూడ్చివేయడం వల్ల కొత్తగా అక్కడికి వరద నీరు చేరడం లేదని, అయినా వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు ఖమ్మం పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.

Similar News

News December 8, 2025

అనంతగిరి: ఆ రెండు గ్రామాలకు నాటు పడవలే దిక్కు

image

అనంతగిరి మండలం పినకోట, జీనబాడు పంచాయతీలకు చెందిన కొత్త బురగా, వలసల గరువు గ్రామాలకు రోడ్డు మంజూరు చేయాలనీ పినకోట సర్పంచ్ ఎస్.గణేష్ డిమాండ్ చేసారు. ఈ గ్రామాలకు రోడ్డు మార్గం లేనందున 3కిలోమీటర్లు నాటు పడవలో ప్రయాణించాలని అన్నారు. ఈ రెండు గ్రామాలలో సుమారు 90 ఆదివాసీ కుటుంబాలు జీవిస్తున్నారన్నారు. ఆ గ్రామాలకి వెళ్లడం కష్టతరంగా ఉందని, ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.

News December 8, 2025

భారత్‌లో విమానయాన సంస్థలకు డిమాండ్: రామ్మోహన్ నాయుడు

image

భారత్‌లో విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతోందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్‌కు తగినట్టుగా కాంపిటీటర్స్ ఉండాలని, దేశంలో మరో 5 పెద్ద విమాన సంస్థల అవసరం ఉందని చెప్పారు. ఏవియేషన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. <<18503378>>ఇండిగో సంక్షోభం<<>>పై చర్యలు తీసుకోవడంతోపాటు దానిని ఒక ఉదాహరణగా తీసుకుంటామని చెప్పారు.

News December 8, 2025

డబ్బు విలువ ఎందుకు తగ్గుతుందంటే?

image

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు <<18505684>>విలువ<<>> ఎలా తగ్గుతుందనే డౌట్ చాలామందికి రావొచ్చు. ద్రవ్యోల్బణం అంటే వస్తు, సేవల ధరలు సాధారణంగా పెరగడం. దీని ఫలితంగా డబ్బుకున్న కొనుగోలు శక్తి కాలక్రమేణా తగ్గుతుంది. ఉదా.. 6% ద్రవ్యోల్బణం ఉంటే ఈ రోజు ₹100తో కొన్న వస్తువును భవిష్యత్తులో ₹106 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే మీ దగ్గరున్న డబ్బుతో గతంలో కొన్నంత ఎక్కువ వస్తువులను ఫ్యూచర్‌లో కొనలేరు. ఇలా డబ్బు విలువ తగ్గుతుంది.