News November 28, 2024
HIGH ALERT.. అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు ఉదయానికి తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప్రకాశం, శ్రీసత్యసాయి, YSR జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. నవంబర్ 30న తుఫాన్ తీరం దాటనుంది.
Similar News
News November 28, 2024
పృథ్వీ షా-యశస్వీ మధ్య అదే తేడా: మాజీ కోచ్
భారత క్రికెట్‌లో Next Big Thingగా ఒకప్పుడు పేరు దక్కించుకున్న పృథ్వీ షా జట్టులో చోటు కోల్పోవడం వెనుక కారణాలపై అతని Ex కోచ్ జ్వాలా సింగ్ స్పందించారు. ఆట తీరులో నిలకడలేనితనం, క్రమశిక్షణారాహిత్యం షాను క్రికెట్‌కు దూరం చేశాయన్నారు. ప్రారంభంలో రాణించినా దాన్ని కొనసాగించేందుకు ఆటతీరు మెరుగుపడాలన్నారు. నిలకడగా రాణిస్తున్న యశస్వికీ, షాకు అదే తేడా అని వివరించారు.
News November 28, 2024
తెలంగాణలో కొత్త మండలం.. మల్లంపల్లి
TG: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని కొత్త మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క మండలం ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో మల్లంపల్లి, రామచంద్రాపూర్ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటు చేశారు. ములుగు రెవెన్యూ డివిజన్, జిల్లా పరిధిలోనే ఈ గ్రామం కొనసాగనుంది. పదేళ్లుగా స్థానికులు చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటూ సీఎం రేవంత్‌కు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.
News November 28, 2024
కాంగ్రెస్ అతివిశ్వాసమే కొంపముంచింది: ఉద్ధవ్ వర్గం
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తరువాత విపక్ష MVAలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌లో ఏర్పడిన అతి విశ్వాసమే MVA కొంపముంచిందని శివసేన ఉద్ధవ్ వర్గం బహిరంగ విమర్శలకు దిగింది. ఎన్నికల ముందే కాంగ్రెస్ నేతలు మంత్రిత్వ శాఖలు పంచుకొనేందుకు కోట్‌లు, టైలు సిద్ధం చేసుకున్నారని మండిపడింది. ఉద్ధవ్‌ను సీఎంగా ప్రకటించివుంటే ఫలితాలు మరోలా ఉండేవని వాదిస్తోంది.