News December 10, 2024
HIGH ALERT.. భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందంది. దీని ప్రభావంతో రేపు NLR, అన్నమయ్య, CTR, TPTY, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ఎల్లుండి నుంచి NLR, ATP, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.
Similar News
News December 5, 2025
విజయోత్సవ ర్యాలీలు, డీజేలు నిషేధం: సూర్యాపేట ఎస్పీ

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల పరిధి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఆంక్షలకు తగినట్లుగా నడుచుకోవాలన్నారు. ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని, ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. బాణాసంచా పేల్చడం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమన్నారు.
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


