News December 21, 2024

HIGH ALERT.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. విశాఖకు 450K.M దూరంలో కేంద్రీకృతమైన ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, VSP, మన్యం, VZM, SKLM జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను రెండ్రోజులుగా వణికిస్తున్నాయి.

Similar News

News December 21, 2024

హైకోర్టులో మోహన్‌బాబుకు రిలీఫ్

image

నటుడు మోహన్‌బాబుకు ఢిల్లీ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఆయన పేరు, ఫొటో, వాయిస్‌ను సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్‌సైట్స్ వాడొద్దని సూచించింది. తన వ్యక్తిగత హక్కుల్ని రక్షించాలని కోరుతూ మోహన్‌బాబు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. అనుమతి లేకుండా మోహన్‌బాబుకు సంబంధించినవేవీ వాడరాదని, ఆయన కంటెంట్‌ను గూగుల్ తొలగించాలని స్పష్టం చేసింది.

News December 21, 2024

బ్యాంకుల్లో NPAలకు UPA అవినీతే కారణం: రఘురామ్ రాజన్

image

ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు, NPAలు పెరగడానికి UPA హయాంలో అవినీతే కారణమని RBI Ex Gov రఘురామ్ రాజన్ అన్నారు. వాటిని రైటాఫ్ చేసి సమస్యను పరిష్కరించిందని మోదీ ప్రభుత్వాన్ని కొనియాడారు. వరుసగా స్కాములు బయటపడటం, గ్లోబల్ క్రైసిస్‌, ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యం, నిరాకరణతో NPAలు పెరిగాయని కుండబద్దలు కొట్టారు. సిస్టమ్‌ను క్లీన్ చేసేందుకు AQR అవసరమంటే జైట్లీ వెంటనే OK చెప్పేశారని గుర్తుచేసుకున్నారు.

News December 21, 2024

రూ.33,137కోట్లతో అమరావతిలో పనులు

image

AP రాజధాని అమరావతిలో రూ.33,137 కోట్లతో 40కి పైగా పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందులో రూ.768 కోట్లతో అసెంబ్లీ, రూ.1045 కోట్లతో హైకోర్టు, రూ.4688.83 కోట్లతో సచివాలయం, HOD భవనాలు, టవర్ల నిర్మాణం, మంత్రులు, న్యాయమూర్తులు, కార్యదర్శుల స్థాయి అధికారులకు నివాస భవనాల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు.