News April 24, 2025
హిమాచల్ ప్రదేశ్‌లో హైఅలర్ట్

పహల్‌గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్‌ప్రదేశ్‌లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో బార్డర్‌ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
Similar News
News April 24, 2025
పాములాంటి పాకిస్థాన్‌తో ఒప్పందం.. MP సంచలన వ్యాఖ్యలు

సింధు నది జలాల నిలిపివేతతో పాకిస్థాన్ అల్లాడిపోతుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అన్నారు. దివంగత ప్రధాని నెహ్రూ పాకిస్థాన్‌కు నీరు ఇస్తే తనకు నోబెల్ బహుమతి వస్తుందని ఆశపడి పాము లాంటి ఆ దేశానికి సింధు జలాలను తరలించారన్నారు. PM మోదీ ఆ ఒప్పందాన్ని నిలిపివేసి, ఏమీ అందకుండా దెబ్బ కొట్టారని చెప్పారు. 52ఇంచుల ఛాతీ ఉన్న ధీరుడి నిర్ణయాలు ఆశ్చర్యకరంగానే ఉంటాయని మోదీని ఉద్దేశించి ప్రశంసించారు.
News April 24, 2025
ఆఫీస్‌కు వస్తారా.. మానేస్తారా?.. గూగుల్ అల్టిమేటం

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ అల్టిమేటం జారీ చేసింది. ఆఫీస్‌కు వస్తారా లేక పూర్తిగా మానేస్తారా అని ప్రశ్నిస్తూ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పనిచేయాలని, ఇంటి నుంచే పనిచేస్తామంటే కుదరదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఏఐకి ప్రాధాన్యాన్ని ఇస్తున్న గూగుల్ ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగించింది.
News April 24, 2025
వక్ఫ్ నిరసనలకు తాత్కాలిక బ్రేక్: ముస్లిం లా బోర్డు

పహల్గాం ఉగ్రదాడిపై ఆలిండియా ముస్లిం లా బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘పహల్గాం దాడి చాలా విషాదకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విషాద సమయంలో వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనలను 3రోజుల పాటు ఆపుతున్నాం’ అని ప్రకటించింది.