News February 24, 2025

పాకిస్థాన్‌లో HIGH ALERT.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్?

image

పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చిన విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(TTP), ISIS, బలూచిస్థాన్ గ్రూపులు యాక్టివ్‌గా ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో CTపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Similar News

News February 24, 2025

విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

image

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం

News February 24, 2025

AP మిర్చికి కేంద్రం మద్దతు ధర

image

AP: మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ధర లేదంటూ ఏపీలో రైతులు ఆందోళన చేయగా, సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి దీనిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేంద్రం మద్దతు ధరపై ఈ ప్రకటన చేసింది. తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.

News February 24, 2025

నాని ‘ది పారడైజ్’ నుంచి అప్డేట్

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది పారడైజ్’ నుంచి అప్డేట్ వచ్చింది. నాని బర్త్ డే సందర్భంగా ‘RAW STATEMENT’ పేరుతో మార్చి 3న స్పెషల్ వీడియో లేదా ఫొటోను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే నాని- శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

error: Content is protected !!