News May 20, 2024

సెల్‌ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ

image

మనిషి జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌తో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఫోన్‌లో వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ సమస్య 12 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. 6 గంటలకుపైగా మాట్లాడితే 25 శాతం సమస్య ఉంటుందని తేల్చారు. మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు, తీవ్ర తలనొప్పి, చెవి సమస్యలూ వస్తాయట. ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీనే దీనికి కారణమని చెప్పారు.

Similar News

News November 20, 2025

వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ. 2.03 కోట్లు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం 27 రోజుల హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రూ. 2 కోట్ల 3 లక్షల 25 వేల 676 వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. హుండీ ద్వారా 228 గ్రాముల బంగారం, 14 కిలోల 300 గ్రాముల వెండి సమకూరినట్లు ఆమె పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది, ఎస్ఎఫ్‌ఐ, హోంగార్డుల పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది.

News November 20, 2025

బోర్డులను “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చారు: సంజయ్‌

image

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.

News November 20, 2025

బెంటోనైట్ క్లే గురించి తెలుసా?

image

చర్మాన్ని సంరక్షించడంలో ఫేస్ ప్యాక్‌లు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిల్లో ఒకటే ఈ బెంటోనైట్ క్లే. అగ్నిపర్వతాలు పేలడం ద్వారా ఏర్పడిన బూడిదతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో ఉండే సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాక్నేని, చర్మంలోని మురికిని దూరం చేస్తాయి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.