News January 8, 2025
కేటీఆర్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు

TG: ఏసీబీ విచారణకు లాయర్లను అనుమతించాలని కేటీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. కాగా ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.
Similar News
News March 23, 2026
యుద్ధం.. సామాన్యుడిపై భారం పడకుండా మోదీ ప్లాన్!

యుద్ధం కారణంగా ఎరువులు, ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత రాకుండా మోదీ అధికారులను అలర్ట్ చేశారు. ఖరీఫ్ కోసం ఎరువుల నిల్వలు పెంచాలని, విద్యుత్ కొరత రాకుండా బొగ్గు సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫార్మా, కెమికల్ రంగాలకు కావాల్సిన ముడి పదార్థాల కోసం ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయాలను వెతకాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.
News March 23, 2026
కరెంట్ అఫైర్స్

* సుదీర్ఘకాలం (8,931 రోజులు) ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా మోదీ
* టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌కు నైట్‌హుడ్ పురస్కారం
* థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ చర్న్‌విరకుల్ తిరిగి ఎన్నిక
* పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకం
* కోకో సాగులో 1, జీడిపప్పు 2, కొబ్బరిలో 4వ స్థానంలో AP
* ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్. 116వ స్థానంలో భారత్
News March 23, 2026
ఎన్నికల కోసమే సేవలా: మోహన్ భాగవత్

సేవ చేయడం అంటే ఇతరులకు ఉపకారం చేయడం కాదని, అది ఒక బాధ్యత అని RSS చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తే కల్మషాలు తొలగిపోయి ఆత్మశుద్ధి జరుగుతుందని వివరించారు. కేవలం ఎన్నికల సమయంలోనో లేదా స్వార్థ ప్రయోజనాల కోసమో చేసే పనులు ఎక్కువ కాలం నిలబడవని, కోరికలు తీరగానే అలాంటి వారు సేవను వదిలేస్తారని విమర్శించారు. భయం వల్ల లేదా బలవంతంగా చేసేది కూడా నిజమైన సేవ అనిపించుకోదని పేర్కొన్నారు.


