News February 19, 2025

పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

image

AP: తమ ఆదేశాలను లెక్కచేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదు చేయడం, కస్టడీలో కొట్టడం తప్ప దర్యాప్తు చేయడంలేదని క్లాస్ తీసుకుంది. ఇలాంటి వైఖరిని సహించేది లేదని తేల్చిచెప్పింది. బొసా రమణ అనే వ్యక్తిపై 27 కేసులుండగా అతడి భార్య దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో పూర్తి వివరాలెందుకు సమర్పించలేదంటూ నిలదీసింది.

Similar News

News January 26, 2026

కట్టె జనుము పంటకు ఈ దశలో నీటి తడులు తప్పనిసరి

image

వరి మాగాణిలో కట్టె జనుము పంటను సాగు చేస్తే మొదటి తడి అవసరం లేకుండా విత్తనాలు మొలకెత్తుతాయి. అయితే పంట మొలిచాక తొలి దశలో అనగా 25 రోజులకు, పూత, విత్తనం ఏర్పడే దశలో పంటను నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి పంట కాలంలో రెండు నుంచి 3 నీటి తడులను అందిస్తే మంచి దిగుబడి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 26, 2026

CCRHలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH) 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, M.Pharm/MVSc, PG, MLT, PhD, ME/MTech, BE/BTech, NET/GPAT/GATE/RET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 10, 11, 12, 13, 16, 17, 18, 24, మార్చి10తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in

News January 26, 2026

ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలి: సీఎం

image

AP: పాలనలో టెక్నాలజీని వినియోగించి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. RTGSపై సమీక్షలో ఆయన మాట్లాడారు. 2026ను టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మార్చాలన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ AI పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో 878 సేవలు అందుతున్నాయని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు.