News October 28, 2024

కుక్కల విద్యాసాగర్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

image

AP: ముంబై నటి కేసులో తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో విజయవాడ కోర్టు తనకు విధించిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విద్యాసాగర్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Similar News

News November 1, 2024

జీవితానికి ఆ ఒక్క సెకను చాలు: మలైకా

image

బాలీవుడ్ ప్రేమజంట అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపావళి పార్టీలో తాను సింగిల్ అంటూ అర్జున్ చేసిన <<14479913>>వ్యాఖ్యలు<<>> ఇందుకు బలం చేకూర్చాయి. ఈ నేపథ్యంలో మలైకా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘హృదయాన్ని ఒక్క సెకను తాకితే అది జీవితాంతం ఆత్మను తాకవచ్చు’ అని ఆమె రాసుకొచ్చారు. దీనికి అర్థమేమిటి? తన లవ్ లైఫ్ గురించేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News November 1, 2024

కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

image

AP: దీపావళి పండుగ రోజున కాకినాడ జిల్లాలో ఘర్షణ చెలరేగింది. కాజులూరు(మ) సలపాకలో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకోగా, ముగ్గురు చనిపోయారు. పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వాగ్వాదం దాడి చేసుకునే వరకూ వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News October 31, 2024

30 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు అనుమతి

image

అత్యాచారానికి గురైన 11 ఏళ్ల బాలిక గర్భం దాల్చడంతో ఆమె 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు బాంబే హైకోర్టు అనుమ‌తించింది. బాలిక క‌డుపు ఇన్ఫెక్ష‌న్ల వ‌ల్ల ఉబ్బింద‌ని త‌ల్లిదండ్రులు మొద‌ట భావించారు. అయితే ముంబైలోని ఓ ఆస్ప‌త్రి వైద్యులు ప్రెగ్నెన్సీ నిర్ధారించారు. దీంతో గుర్తు తెలియ‌ని నిందితుడిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. DNA ప‌రీక్ష కోసం పిండం నుంచి శాంపిల్స్ సేక‌రించాల‌ని కోర్టు ఆదేశించింది.