News January 28, 2025

ఆత్మీయ భరోసాపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: పట్టణాల్లోని రైతు కూలీలకూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలనే వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రామాల్లోని కూలీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారికి అన్యాయం జరుగుతోందని కోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో మున్సిపాలిటీల్లో పలు గ్రామాలను విలీనం చేశారని, రైతు కూలీలందరినీ ఒకేలా చూడాలని పిటిషనర్లు కోరారు.

Similar News

News November 14, 2025

పర్యావరణం కోసం ఈ వారియర్ మామ్స్

image

దిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు వాయుకాలుష్య తీవ్రత పెరిగిపోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి బవ్రీన్‌ వారియర్‌ మామ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాయుకాలుష్యం చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తుల్లోని పోషక విలువలను నాశనం చేస్తుందంటున్న బవ్రీన్ ఎన్నో ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారియర్ మామ్స్‌లో ప్రస్తుతం 1400లకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు.

News November 14, 2025

ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

image

ABC జ్యూస్.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్‌గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్‌లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.

News November 14, 2025

పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.