News February 18, 2025
విడదల రజినీకి హైకోర్టులో ఊరట

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Similar News
News November 19, 2025
ఒక్క రోజులో రూ.6వేలు పెరిగిన సిల్వర్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఒకే రోజులో రెండు సార్లు భారీగా పెరిగాయి. ఇవాళ ఉదయం కేజీ సిల్వర్ రేటు రూ.3వేలు పెరగ్గా తాజాగా మరో రూ.3వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,76,000కు చేరింది. అటు బంగారం ధరల్లో సాయంత్రం ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,24,860, 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,14,450గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 19, 2025
రూ.1.25కోట్ల ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి.. కానీ!

యువత, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని రాజకీయ ఉద్ధండులు పిలుపునివ్వడం చూస్తుంటాం. అలా ప్రజాశ్రేయస్సు కోసం ఏకంగా రూ.1.25కోట్ల ఉద్యోగాన్ని వదిలొచ్చి పోటీ చేసి ఓడిపోయాడో యువకుడు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం కోల్‌కత్తాలో చదివి జర్మనీలో ఉద్యోగం చేస్తోన్న శశాంత్ శేఖర్ కాంగ్రెస్ తరఫున బిహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. పట్నా సాహిబ్‌లో బీజేపీ అభ్యర్థి రత్నేష్ కుమార్ చేతిలో ఆయన 38,900 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
News November 19, 2025
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం

AP: సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. కడప(D) పెండ్లిమర్రి సభలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. తానూ రైతు బిడ్డనే అని, నాన్నకు వ్యవసాయంలో సాయం చేసేవాడినని వెల్లడించారు. అన్నదాతల కష్టాలు తెలుసు కాబట్టే అన్నదాత సుఖీభవ కింద రూ.14వేలు అందజేశామని పేర్కొన్నారు. సాగు తీరు మారి, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పంచసూత్రాలను అమలు చేస్తున్నామన్నారు.


