News October 15, 2024

గ్రూప్-1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన ఆన్సర్లు ఇవ్వలేదని, వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ యథావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

Similar News

News January 30, 2026

సల్మాన్-ఐశ్వర్యా రాయ్ లవ్ స్టోరీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ఓల్డ్ రిలేషన్‌షిప్‌పై నిర్మాత శైలేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిదీ ‘రోమియో-జూలియట్’ తరహాలో ఎమోషనల్, ‘వయలెంట్ లవ్ స్టోరీ’ అని పేర్కొన్నారు. ఐశ్వర్య గౌరవప్రదమైన, తెలివైన వ్యక్తి అని, సల్మాన్ చాలా ప్యాషనేట్ అని తెలిపారు. సల్మాన్ కంటే ముందు ఆమెకు మోడల్ రాజీవ్ మూల్‌చందనీతో మాత్రమే రిలేషన్ ఉండేదని.. ఇండస్ట్రీలో మరెవరితోనూ లేదని చెప్పారు.

News January 30, 2026

వెనిజులాతో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ: మోదీ

image

<<18951392>>వెనిజులా<<>> తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకారం కుదిరినట్లు ఆయన ట్వీట్ చేశారు. అన్నిరంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కృషి చేస్తామని తెలిపారు. బలమైన దౌత్యం, విజన్‌తో ఇరు దేశాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని రోడ్రిగ్జ్‌ చెప్పారు.

News January 30, 2026

ఫామ్‌హౌస్‌లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

image

TG: హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న 3PMకు విచారణకు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో విచారణ చేసేందుకు <<19005122>>నిరాకరించడానికి<<>> గల కారణాలను వివరించారు. తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందని తెలిపారు. విచారణను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను, రికార్డులను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు.