News August 27, 2025
గణేశ్ మండపాలకు హైకోర్టు మార్గదర్శకాలు

TG: గణేశ్ మండపాల వద్ద సాయంత్రం 6-10 గంటల వరకే సౌండ్ సిస్టమ్ అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. సౌండ్ డెసిబుల్ స్థాయి దాటకుండా చెకింగ్ మీటర్లతో పర్యవేక్షించాలని సూచించింది. ఆసుపత్రులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాల వైపు స్పీకర్లు పెట్టరాదని, నిర్వాహకులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ప్రజల విజ్ఞప్తులు, సమస్యలను దృష్టిలో పెట్టుకొని విగ్రహాల ఏర్పాటుకు అనుమతులివ్వాలని అధికారులు, పోలీసులకు సూచించింది.
Similar News
News August 27, 2025
TCS కొత్త ఆఫీస్ అద్దె రూ.2,130 కోట్లు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బెంగళూరులో కొత్త క్యాంపస్ ప్రారంభించనుంది. ఇందుకు బెంగళూరులోని 360 బిజినెస్ పార్క్ టవర్స్ యాజమాన్యంతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. 14 లక్షల చదరపు అడుగుల కార్యాలయానికి 15 ఏళ్లకుగానూ రూ.2,130 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. నెలకు రూ.9.31 కోట్ల అద్దెతో రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది. ప్రతి మూడేళ్లకూ 12 శాతం అద్దె పెంపు ఉండనుంది.
News August 27, 2025
భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలన్నారు. వాగులు, కాజ్‌వేలు, కల్వర్టులపై రాకపోకలు నిషేధించాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంటువ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
News August 27, 2025
నారా రోహిత్ ‘సుందరకాండ’ రివ్యూ&రేటింగ్

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సుందరకాండ’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. హీరో రోహిత్ నేచురల్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్లు శ్రీదేవీ విజయ్‌కుమార్, విర్తి వాఘని తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య కామెడీ మూవీకి పెద్ద ప్లస్. కానీ రొటీన్, ముందే ఊహించే సీన్లు ఇబ్బంది పెడతాయి. అసందర్భంగా వచ్చే సాంగ్స్ విసుగు తెప్పిస్తాయి. కథను వివరించడంలో డైరెక్టర్ వెంకటేశ్ తడబడ్డారు.
రేటింగ్: 2/5