News October 16, 2024
ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ

TG: క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు విననుంది. ఏపీకి వెళ్లాలంటూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్‌ను క్యాట్ ఆదేశించిన విషయం తెలిసిందే.
Similar News
News December 4, 2025
పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ మధ్య పీస్ ప్లాన్‌పై నిన్న రష్యాలో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్‌తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్ సమావేశం బాగా జరిగింది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వారిద్దరూ అభిప్రాయపడ్డారు’ అని అన్నారు.
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<


