News August 2, 2024

హీరో విశాల్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం

image

కోలీవుడ్ హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యారు. వైట్ పేపర్‌పై తాను సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని జడ్జి ఎదుట విశాల్ వాదించారు. దీంతో ‘తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు.. సరిగ్గా సమాధానం చెప్పండి’ అంటూ న్యాయమూర్తి విశాల్‌ను ఆదేశించారు.

Similar News

News December 11, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం బంగారం <<18528737>>ధరలు<<>> కాస్త తగ్గగా.. గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.440 పెరిగి రూ.1,30,750కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.400 ఎగబాకి రూ.1,19,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,09,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 11, 2025

ఈ నూనెలతో మేకప్ తొలగిద్దాం..

image

మేకప్‌ వేసుకోవడంతో పాటు దాన్ని తియ్యడంలో కూడా జాగ్రత్తలు పాటిస్తేనే చర్మ ఆరోగ్యం బావుంటుందంటున్నారు నిపుణులు. వాటర్ ఫ్రూఫ్ మేకప్ తొలగించడానికి ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల సులువుగా శుభ్ర పడటంతో పాటు చర్మం కూడా తాజాగా ఉంటుంది. కీరదోస రసంలో చెంచా గులాబీ నూనె కలిపి ముఖానికి రాసుకున్నా మేకప్ పోతుంది. ఇది సహజ క్లెన్సర్ గానూ పని చేస్తుంది. తేనె, బాదం నూనె కలిపి మేకప్ తీసినా చర్మం పాడవకుండా ఉంటుంది.

News December 11, 2025

సర్పంచ్ ఎన్నికలు.. తల్లిపై కూతురి విజయం

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం <<18450009>>తిమ్మయ్యపల్లిలో<<>> తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ విజయం సాధించారు. ఇద్దరిమధ్య హోరాహోరీగా పోరు జరగగా తల్లిపై కూతురు 91 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. సుమ గతంలో గ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో రెండు కుటుంబాలు ఎన్నికల్లో ఢీకొన్నాయి.