News September 23, 2024

10 మంది MLAలకు హైకోర్టు నోటీసులు

image

TG: ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Similar News

News October 14, 2025

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు సర్కార్.. గురు/శుక్రవారం విచారణ!

image

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రిజర్వేషన్ల GOను కొట్టివేస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలివ్వగా, దానిపై SLPని దాఖలు చేసింది. ఈమేరకు ప్రభుత్వ న్యాయవాది సుప్రీం రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేశారు. CJI అనుమతితో లిస్ట్ చేస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

News October 14, 2025

ఆహార కల్తీని అడ్డుకోలేరా?.. FSSAIపై విమర్శలు

image

ఇండియాలో అత్యంత అవినీతి & పనికిరాని సంస్థ FSSAI అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మార్కెట్‌లో కల్తీ ఆహారం, నాణ్యత లేని ప్యాకేజ్డ్ ఫుడ్‌లు యథేచ్ఛగా అమ్ముడవుతున్నా ఈ సంస్థ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. సమస్య వచ్చిన తర్వాతే స్పందిస్తోందని మండిపడుతున్నారు. ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమైన కల్తీ ఆహారాన్ని నియంత్రించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 14, 2025

చిన్నారుల ప్రాణం ఖరీదు 10% కమీషన్!

image

MPలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి 23 మంది చిన్నారులు చనిపోవడం తెలిసిందే. వీరికి ఆ దగ్గు మందు ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీ సంపాదించింది ఎంతో తెలుసా? ఒక్కో బాటిల్‌ ధర రూ.24.54 కాగా Sresan కంపెనీ నుంచి అతడికి వచ్చేది 10% కమీషన్‌(రూ.2.54). ప్రభుత్వ డాక్టర్ అయినప్పటికీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాడు. ప్రమాదకరమని తెలిసినా సోనీ రిపీటెడ్‌గా కోల్డ్రిఫ్ ప్రిస్క్రైబ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.